టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుండి 26వ తేదీ వరకు అనంతపురం జిల్లాలో 6 ప్రాంతాలలో,”,” చిత్తూరు జిల్లాలో 6 ప్రాంతాలలో, కర్నూలు జిల్లా ఒకచోట శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. “,” అనంతపురం జిల్లా:”,” – అక్టోబర్ 2వ తేదీన వజ్రకరూర్ మండలం, పుట్టిపాడు గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. “,” – అక్టోబర్ 4న ఉరవకొండ మండలం, లత్తవరం తాండాలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. “,” – అక్టోబర్ 5న బ్రహ్మసముద్రం మండలం, పాలవెంకటాపురం గ్రామంలోని శ్రీవారి కల్యాణం జరుగనుంది. “,” – అక్టోబర్ 6న పుట్టపర్తి మండల కేంద్రంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. “,” – అక్టోబర్ 7న యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. “,” – అక్టోబర్ 8న నార్పల మండలం, మాలవాడ్లపల్లి గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. “,” చిత్తూరు జిల్లా: “,” – అక్టోబర్ 6న కుప్పం మండలం, ఊర్లోబానపల్లి గ్రామంలోని శ్రీ బేతరాయస్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. “,” – అక్టోబర్ 21న వి.కోట మండలం, మద్దిరాల గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. “,” – అక్టోబర్ 22న శాంతిపురం మండలం, 121 పేడూరులో స్వామివారి కల్యాణం జరుగనుంది. “,” – అక్టోబర్ 23న గంగవరం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. “,” – అక్టోబర్ 24న యాదమరి మండలం, బండివాళ్లవూరు క్రాస్ గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. “,” – అక్టోబర్ 25 ఐరాల మండల కేంద్రాంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. “,” – అక్టోబర్ 26న పెనుమూరు మండలం, బత్తివంక గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. “,” కర్నూలు జిల్లా: “,” – అక్టోబర్ 3న పత్తికొండ మండల కేంద్రంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. “,” అక్టోబర్ 6న చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఊర్లోబానపల్లిలో జరిగే శ్రీవారి కల్యాణం ఉదయం 10 గంటలకు, మిగిలిన ప్రాంతాలలో అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి 10-10-2018 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ( బుధవారము)- శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి ,”,” 11-10-2018 ఆశ్వయుజ శుద్ధ విదియ (గురువారము ) – శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ,”,” 12-10-2018 ఆశ్వయుజ శుద్ధ తదియ ( శుక్రవారము ) – శ్రీ గాయత్రి దేవి , “,”13-10-2018 ఆశ్వయుజ శుద్ధ చవితి ( శనివారము) – శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి , “,”14-10-2018 ఆశ్వయుజ శుద్ధ పంచమి ( ఆదివారము )- శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) , “,”15-10-2018 ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (సోమవారము ) -శ్రీ అన్నపూర్ణా దేవి , “,”16-10-2018 ఆశ్వయుజ శుద్ధ సప్తమి (మంగళవారము) – శ్రీ మహాలక్ష్మిదేవి ,”,” 17-10-2018 ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి) (బుధవారము ) శ్రీ దుర్గా దేవి , “,”18-10-2018 ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి) గురువారము శ్రీ మహిషాసురమర్ధినీ దేవి, “,”18-10-2018 ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) గురువారము శ్రీ రాజరాజేశ్వరి దేవి , “,”18-10-2018 వ తేదీన గురువారము సాయంత్రం 5 గం.లకు కృష్ణానది యందు \”హంసవాహన తెప్పోత్సవం\” నిర్వహించబడును తూర్పుగోదావరి జిల్లా అన్నవరం క్షేత్రంలో ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణస్వామికి స్వర్ణపుష్పార్చన నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారిని మనోహరంగా అలంకరించి పూజలు చేశారు. అన్నవరంలోని వనదుర్గాదేవి ఆలయంలో వేదోక్తంగా చండీహోమం, విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో జితేంద్ర, పలువురు ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి నిత్య అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక జలాలు, పాలు, పెరుగుతో అభిషేకం చేశారు. బాలాలయ మంటపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని, అమ్మవారిని నేత్రపర్వంగా అలంకరించి పూజలు చేశారు. వేదమంత్రాలతో, వివిధ రకాల పువ్వులతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. సుమ సౌరభాలతో స్వామివారు భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మంగళవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు.”,”అంకురార్పణ ఘట్టం కోసం ముందుగా యాగాశాలలో శ్రీ సీతారామలక్ష్మణులు, శ్రీహనుమంతుడు, శ్రీ సుగ్రీవుడు, శ్రీ అంగదుడు, శ్రీ అనంతుడు, శ్రీ గరుడాళ్వార్‌, శ్రీ చక్రత్తాళ్వార్‌, శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు.”,” అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరించి బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేశారు. ఆ తరువాత హోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను, అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడశోపచార పూజలు నిర్వహించారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి అర్చన మంటపంలో ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు చేశారు.”,”కుంకుమార్చనలు జరిపారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో జగన్మాతకు మంగళ నీరాజనాలు, విశేష హారతులు సమర్పించారు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
TOP